AP: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 37 మంది ప్రయాణికులతో వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు.. ఆదివారం అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతుండగా ఐలూరు - ఐనపూరు మధ్య రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంతో అదుపుతప్పి కరకట్టపై నుంచి కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.