సింగనమల: సరైన సమయానికి సరుకులు పంపిణీ చేయాలి

సింగనమల మండల కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ గోదామును ఆదివారం జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు గోదామును తనిఖీ చేశారు. అనంతరం గోదాములోని స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నెలాఖరులోపు సరుకులు అన్ని మండలాలకు సరఫరా చేయాలని సూచించారు. వాహనాల కొరత ఏర్పడితే ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని సరుకులను సరఫరా చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్