ఎచ్చెర్ల: జరజాం వద్ద హైవేపై యాక్సిడెంట్.. డ్రైవర్ మృతి

ఎచ్చెర్ల మండలం జరజాం జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ టైర్ పేలిపోవడంతో వెనుక నుండి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ నేపాల్ నంది (40)కి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో మరణించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్