AP: ఈ నెల 11న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా శాసన సభ సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బిల్లు, ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.