కంచిలి మండలం మఠం కంచిలి చెరువులో కార్తీక మాసం శోభ వెల్లువిరిసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే చెరువు వద్దకు భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు జరుపుకుని, స్నానాలు ఆచరించారు. చెరువులో అరటి దవ్వతో చేసిన పడవలను విడిచిపెట్టి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం మంగళహారతులు అందజేసి సూర్య నమస్కారాలు చేశారు. కార్తీక మాసం చెరువులో పడవలు విడిచిపెట్టే ఆచారం అనాదిగా వస్తుందని భక్తులు తెలిపారు.