అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే చర్యలు తప్పదు: ఎస్ఐ

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పదని గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ శుక్రవారం హెచ్చరించారు. ఆయన మీడియాకు వెల్లడిస్తూ మండల పరిధిలో లైసెన్స్ లేకుండా బాణాసంచా విక్రయించడానికి అనుమతులు లేదని స్పష్టం చేశారు. దీపావళికి వారం రోజులు సమయం ఉన్నందున దుకాణదారులు తప్పనిసరిగా కలెక్టర్ వద్ద తాత్కాలిక లైసెన్స్ పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా విక్రయించరాదన్నారు.

సంబంధిత పోస్ట్