చిత్తూరు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే భారీ జరీమానా

చిత్తూరు నగరంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు తెలిపారు.పట్టుబడ్డ 21 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 2.10 లక్షలు జరిమానాను జడ్జ్ ఉమాదేవి విధించారన్నారు.మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే రూ.10 వేలు జరిమానా,రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా,3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని శనివారం మీడియా సమావేశంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్