ఇకపై ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే

గుడిపాల మండలంలోని రాసనపల్లిలో అక్రమ నాటు సారా, కర్ణాటక మద్యం గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా కొనసాగుతుందని, ఇకపై ఉపేక్షించేది లేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం లక్ష్మీ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు గల ప్రజా దర్బార్ జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా.. అహింస, యువత మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణపై నియోజకవర్గ పరిధిలో గల సీఐలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వంలో రాసనపల్లిలోనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ సారా, గంజాయి ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు వాడకంపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టమన్నారు.

సంబంధిత పోస్ట్