చిత్తూరు నగరంలో రూ. 45 వేలు విలువ చేసే 720 ప్యాకెట్ల మద్యాన్ని, వాటిని తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పక్కా సమాచారం మేరకు కన్నికాపురం గ్రామం వైపు వస్తున్న టాటా ఇండికా కారును తనిఖీ చేశామన్నారు. అక్రమంగా తరలిస్తున్న 15 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో కర్ణాటకకు చెందిన శివకుమార్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు.