న్యూ ఎక్సైజ్ పాలసీ డిస్టిక్ గెజిట్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. జిల్లాకు 104 మద్యం షాపులు కేటాయించారన్నారు. నేటి నుంచి 9వ తేదీ వరకు మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ. 2లక్షలు నాన్ రిఫండబుల్ మొత్తాన్ని చెల్లించాలన్నారు. 11వ తేదీ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ సహకార కళ్యాణ మండపంలో టెండర్ లాటరీ పద్ధతిలో జరుగుతుందన్నారు. దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్లో చేసుకోవచ్చన్నారు.