రూ. 50 లక్షల చెక్కును సీఎంకు అందజేసిన ఎమ్మెల్యే

ఇటీవల భారీ తుఫాను దాటికి అతలా కుతలమైన విజయవాడలో నిరాశ్యులైన వరద బాధిత కుటుంబాలకు జీ.డి. నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్, తన తనయుడు రాహుల్ తో కలిసి గురువారం అమరావతి సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డాక్టర్ థామస్ కుటుంబానికి అభినందనలు తెలియజేశారు. జీ.డి .నెల్లూరు నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే థామస్ రూ. 50 లక్షలు చెక్కును అందించిన సందర్భంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్