కుప్పంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టిడిపి నేతలు రవి, వేలు, మని, ఇర్ఫాన్ అర్జీలను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. వార్డులలో క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రావడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్