కుప్పం: వేణుగోపాల్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం

కుప్పంలో జరిగిన క్వారీ ప్రమాదంలో మృతి చెందిన వేణుగోపాల్ కుటుంబ సభ్యులను ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం మంగళవారం పరామర్శించారు. క్వారీ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని చెప్పారు. మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా టీడీపీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

సంబంధిత పోస్ట్