కుప్పంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం టిడిపి నేతలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు మేరకు ప్రతి గడపకూ తిరుగుతూ ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి గురించి కుప్పం పట్టణ వీధుల్లో స్థానిక ప్రజలకు టిడిపి నేతలు వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కన్నన్, జాకీర్, మంజునాథ్, ఆర్ఆర్ రవి, శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్