పలమనేరు: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం కోరారు. పలమనేరులో డివిజన్ స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. మినిమం టైం స్కేల్, హెచ్ఎన్ఏ పాలసీ అమలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 25 లక్షలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన శేఖర్, రామమూర్తి, రెడ్డి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్