సూళ్లూరుపేట: కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించండి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలోని భేరిపేటలో చర్చి వీధికి వెళ్లే దారిలో రహదారులు అడవిని తలపిస్తున్నాయి. కంప చెట్లు రోడ్డు పైకి మొలచి రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు కూడా వెలగడం లేదని వారు వాపోతున్నారు. ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి కంప చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించి, వీధి దీపాలు అమర్చాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్