సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రధాన గ్రామ పంచాయతీలకు మంజూరైన చెత్త సేకరణ ట్రాక్టర్లను ఎమ్మెల్యే విజయశ్రీ, టీడీపీ ఇన్ ఛార్జ్ లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ లక్ష్యంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెత్త సేకరణ ట్రాకర్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.