14న జాతీయ లోక్ అదాల‌త్

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మ‌డి విశాఖపట్నం జిల్లా ప‌రిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాల‌త్ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని జిల్లా కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆల‌పాటి గిరిధ‌ర్ బుధ‌వారం తెలిపారు. న్యాయ స్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, కేసులు పరిష్కారానికి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్