సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు మొదటిసారిగా లాభాల వాటా బోనస్ చెల్లించడం చారిత్రాత్మకమని ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు రంజిత్ అన్నారు. మందమర్రి పట్టణంలో కాంటాక్ట్ ఉద్యోగులు, ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ కు పాలభిషేకం చేశారు. సింగరేణి లాభాల బోనస్ ప్రభుత్వం ద్వారా ప్రకటింపజేసిన జనక్ ప్రసాదుకు కృతజ్ఞతలు తెలిపారు.