భారత యువ షట్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 ట్రోఫీని గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-18, 22-20 స్కోరు తేడాతో లీషి ఫెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనా లక్ష్యసేన్ వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించాడు.