జనగణనలో కులగణనను చేర్చాలి: CM రేవంత్

ప్రస్తుతం దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవాలంటే సమాజానికి మెగా హెల్త్‌ చెకప్‌లా కులగణన చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం తాము తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే 92% పూర్తి చేశామన్నారు. కేంద్రం దీనిపై స్పందించి వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా మొదలుపెట్టే జనగణనలో కులగణనను చేర్చాలని డిమాండ్‌చేశారు. లేదంటే ఇందుకోసం రాహుల్‌గాంధీ చేపట్టే పోరాటానికి అండగా నిలుస్తామని మంగళవారం ఢిల్లీలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్