బిల్వార్చనలో పాల్గొన్న ఎమ్మెల్యే

మక్తల్ పట్టణంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య పురస్కరించుకొని నిర్వహించిన బిల్వార్చనలో ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మహా మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నం వడ్డించారు. బిల్వార్చనలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్