కృష్ణానది పరివాహక గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

మగనూర్, కృష్ణ మండలాల్లోని కృష్ణానది పరివాహక గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పర్యటించారు. కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు పార్టీ నాయకులకు తగు సూచనలు చేశారు. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా నదికి వరద పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్