బహదూర్ పురా: రామనస్తపురా లో పర్యటించిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలో అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ తెలిపారు. సోమవారం రామనస్థపురాలో అయన పర్యటించారు. మక్కా కాలనీలో బాక్స్ టైపు డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రూ. 17. 2 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్