ఈ సమాజంలో జరుగుతున్న వరకట్న హత్యలను, వేధింపులను అరికట్టాలని పోగుల లత న్యాయ పోరాట కమిటి ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలకు లత కుటుంబీకులు, మహిళా సంఘాల నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పోగుల లత నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటలో ఈనెల 8న హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.