జమలాపురం హుండీ ఆదాయం రూ. 29. 51లక్షలు

ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం. వీరస్వామి, ఈఓ కె. జగన్మోహన్ రావు లెక్కించగా 91 రోజులకు గాను రూ. 29, 51, 477 ఆదాయం నమోదైంది. ఆతర్వాత వచ్చే నెల 3 నుండి ఆలయంలో నిర్వహించనున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు.

సంబంధిత పోస్ట్