పిఆర్సి సాధనకై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఈరోజు సత్తుపల్లి డివిజన్ ఆఫీస్ ముందు రెండవ రోజు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పి ఆర్ సి నీ ఇవ్వకుండా యాజమాన్యం జాప్యం చేస్తుందని వెంటనే ఉద్యోగులకు రావాల్సిన పి ఆర్ సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా జాప్యం చేస్తే మెరుపు సమ్మె కు సైతం సిద్దమని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఈ లు శరత్, నాగేశ్వరావు సిబ్బంది చారీ, బలరాం, ప్రసాద్, ఈ ఆర్ ఓ సిబ్బంది నరేష్, మానస, రాము, శ్రీను, వంశీ తదితరులు పాల్గొన్నారు.