రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సర్వేలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న వివాహాలు జరిగిన వారి వివరాలు, ఒంటరి మహిళల వివరాలను విడివిడిగా సర్వే చేసి నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. వైరాలోని బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్లో ఆదివారం నిర్వహించిన స్టడీ సర్కిల్లో ఆయన మాట్లాడారు. కుటుంబ సర్వే వివరాలలో ఉన్న పలు ప్రశ్నాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.