భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ సిబ్బందితో నెలవారి నేర సమీక్ష సమావేశం మంగళవారం ఎస్పీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి కేసుల్లో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.