గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని లోక్సభ పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారన్నారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారని, ఈ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా..? అని ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.