ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్

బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మేల్, ఫిమేల్ వార్డులలో రోగులకు అందించే చికిత్సను వైద్యుల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సేవలు అందజేయాలని ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్