నారాయణ గుట్ట వద్ద బాగాపూర్ గ్రామస్తుల వనభోజనాలు

శనివారం లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో బాగాపూర్ గ్రామస్తులు సామూహిక మహా నైవేద్యాలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. రైతులు ప్రతి ఏటా వర్షాకాలంలో విత్తనాలు వేసే ముందర ప్రత్యేక పూజలు నిర్వహించి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని పాడి పశువులు పిల్లాపాపలు చల్లగుండాలని లక్ష్మీనారాయణ స్వామికి మొక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహస్వామి, బాగాపూర్ గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వంటలు వండుకొని వన భోజనాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇలా చేయడం ఆనవాయతీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్