మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన వినయ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు రవాణా అంశాలపై మంత్రికి శనివారం విన్నవించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టకి ప్రతి సోమవారం భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వలన భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నదని తెలియచేసారు.