రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. చిన్న ప్రమాదం జరిగినా వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే ఇండియన్ రైల్వే.. అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్న పేలుడు పదార్థాలు, పెట్రోల్, డీజిల్, పొగతాగడం లాంటి వాటిని రైళ్లలో అనుమతించదు. అయితే, తాజాగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడు కోచ్‌లోనే బీడీ తాగాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు.