TG:భువనగిరి సబ్ జైలు నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఈనెల 22న రిమాండ్ ఖైదీని జైలు సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ తరుణంలోనే పోలీసుల కళ్లు కప్పి ఆ ఖైదీ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. అనంతరం పోలీసులు.. రిమాండ్ ఖైదీని తిరిగి పట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా భువనగిరి సబ్ జైలుకు తరలించారు.