ఓటరు జాబితాలోని తప్పులను గుర్తించి సవరించే ప్రక్రియ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. చనిపోయిన వారి పేర్లను జాబితా నుండి తొలగించాలన్నారు. నకిలీ లేకుండా ఓటరు నమోదు చేపట్టాలని కలెక్టర్ నారాయణ రెడ్డి బూతు లెవెల్ అధికారులకు సూచించారు. శనివారం శంషాబాద్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపును జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు.