రాజేంద్ర నగర్ నియోజకవర్గం సులేమాన్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మహమ్మద్ జహీరుద్దీన్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు, రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జి పి. కార్తీక్ రెడ్డి ఆదివారం మహమ్మద్ జహీరుద్దీన్కు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.