ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. గత మూడు రోజులకు పైగానే హర్ష సాయితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనేది పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు. ఇప్పటికే హర్షసాయిపై రేప్, చీటింగ్ కేసు నమోదైంది. తనకు మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడని బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.