బిర్యానీ, గ్రిల్ చికెన్ తిని అస్వ‌స్థ‌త‌కు గురైన ముగ్గురు స్నేహితులు

TG: రంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మీర్‌పేట్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు ఈనెల 20న మ్యాజిక్ పిన్ అనే యాప్‌లో అరోమా రెస్టారెంట్ నుంచి బిర్యానీ, గ్రిల్ చికెన్ ఆర్డ‌ర్ చేశారు. తిన్న మరుసటిరోజు క‌డుపునొప్పి, విరేచ‌నాల‌తో బాధ‌ప‌డి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఫుడ్ పాయిజ‌న్ అవ‌డం వ‌ల్లే అస్వ‌స్థ‌తకు గురయ్యారని వైద్యులు ధృవీకరించారు. దీంతో రెస్టారెంట్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదివారం బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్