హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రజా పాలన దరఖాస్తులు, ఆరు గ్యారంటీల అమలుపై కీలక చర్చలు జరపనున్నారు. కొత్త పథకాలకు నిధుల సమీకరణపై సీఎం, మంత్రులు చర్చించనున్నారు. అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్