ఏపీలో కూటమి ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలను ఎప్పటికప్పుడు అందజేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకులు రైతులకు రూ.1.60 లక్షల వరకు ఇస్తాయి. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకొని తిరిగి 40 రోజుల్లోగా చెల్లించడానికి అవకాశం ఉంది.