పేడ పిడకల కింద రూ.20 లక్షలు

85చూసినవారు
పేడ పిడకల కింద రూ.20 లక్షలు
ఒడిశాలో పేడ పిడకల కింద డబ్బుల కట్టలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ఆగ్రో కంపెనీలో ఒడిశాకు చెందిన గోపాల్ బెహెరా పని చేశాడు. ఆ సమయంలో కంపెనీ లాకర్ నుంచి రూ.20 లక్షలు చోరీ చేసి బావమరిది రబీంద్ర బెహెరాతో ఒడిశాకు తరలించాడు. బాలాసోర్ జిల్లా బడామందారుని గ్రామంలో పేడ పిడకల కింద ఈ డబ్బును దాచిపెట్టారు. చోరీపై ఫిర్యాదు అందడంతో హైదరాబాద్ పోలీసులు ఒడిశా వెళ్లి బెహెరా ఇంటిపై దాడి చేసి పేడ పిడకల కింద డబ్బుల కట్టలను గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్