ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. వరుసగా ఐదో రోజు అక్కడి గాలి నాణ్యత 400 పాయింట్లకు పైగా నమోదైంది. ఓ వైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం వల్ల ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు 3 విమానాలను రద్దు చేశారు. మరో 107 విమానాల రాకపోకలు ఆలస్యం అవుతాయని ఫ్లైట్ రాడార్ వెల్లడించింది. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో ఏక్యూఐ 428గా నమోదైంది.