ఏపీలో 11 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు బాలికను పట్టణ పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.