ఎస్‌బీఐ నుంచి మరో 500 బ్రాంచీలు: ఆర్థిక మంత్రి

59చూసినవారు
ఎస్‌బీఐ నుంచి మరో 500 బ్రాంచీలు: ఆర్థిక మంత్రి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 500 ఎస్‌బీఐ బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీంతో బ్యాంకు బ్రాంచీల సంఖ్య 23 వేలకు చేరుతుందన్నారు. ముంబైలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవంలో నిర్మలా సీతారామన్‌ ప్రసంగించారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి 50 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారని, దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఈ బ్యాంకు వాటా 22.4 శాతంగా ఉందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్