వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు అని జగన్ అన్నారు. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజని.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.