భారత దేశంలో మలేరియా మరణాలు గణనీయంగా తగ్గినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.
2017లో 64 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా, 2023 నాటికి 20 లక్షలకు తగ్గినట్లు ఓ నివేదికలో తెలిపింది. మరణాలు సైతం 11,100 నుంచి 3,500కు తగ్గినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మలేరియా మరణాలు, వ్యాప్తిని తగ్గించడంలో భారత్ సఫలీకృతం అయినట్టు వివరించింది.