అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనలో దూకుడు పెంచనున్నారు. 2025 జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే గతంలో కంటే దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ అధికార సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటికే తన బృందానికి పలు సూచనలు చేశారని, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు 25 కీలక ఫైళ్లపై సంతకం చేయనున్నట్లు సమాచారం.