మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతాపారాయణానికి గిన్నిస్ రికార్డు లభించింది. బుధవారం గీతా జయంతి సందర్భంగా ఉజ్జయినిలోని లాల్ పరేడ్ మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో పాటు దాదాపు 5వేల మంది భక్తులు హాజరై గీతా పఠనం చేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.