AP: తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుసగా జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలేశుని భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందన్న వార్త తీవ్ర దుమారం రేపింది. ఇటీవల క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారు. తొక్కిసలాట మరువక ముందే శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది. తాజాగా శనివారం తిరుమలలో కొందరు భక్తులు ఎగ్ పలావ్‌ని కొండపైకి తీసుకెళ్లి, అక్కడే తినడం మరింత కలకలం రేపింది. ఈ వరుస అపచారాలు శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.